IRE vs RSA: సౌతాఫ్రికాపై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

ప్రపంచ క్రికెట్‌లో సంచలన విజయం నమోదైంది. పసికూన ఐర్లాండ్.. బలమైన సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఆదివారం అబుదాబి వేదికగా ఈ ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఐరిష్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో సఫారీ జట్టుపై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. 

ఆఖరిలో తడబాటు   

దక్షిణాఫ్రికా విజయానికి చివరి 12 బంతుల్లో 23 పరుగులు అవసరం కాగా.. ఆఖరిలో తడబడ్డారు. మార్క్ అడైర్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు కోల్పోవడం ఆ జట్టు విజయాలను బాగా దెబ్బతీసింది. ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులు వచ్చాయి. అనంతరం ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా.. విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 1-1తో సమం చేసింది.

Also Read :- భీకర ఫామ్‌లో ఇంగ్లీష్ కెప్టెన్

రాస్ అడైర్ శతకం

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ రాస్ అడై(100) మెరుపు శతకం బాదగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(52) హాఫ్ సెంచరీ చేశాడు.