టోలరెన్స్ ఓవల్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఐర్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని సాధించింది. ఛేజింగ్‌లో కెప్టెన్ బాల్ బిర్నీ (58 నాటౌట్) నిలకడగా ఆడటంతో.. అఫ్గానిస్తాన్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. అఫ్గాన్ నిర్దేశించిన 111 రన్స్ లక్ష్యాన్ని శుక్రవారం మూడో రోజు ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 31.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పీటర్ మూర్ (0), కర్టిస్ క్యాంపెర్ (0), హ్యారీ టెక్టర్ (2) ఫెయిలైనా, బాల్‌బిర్నీ కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. పాల్ స్టిర్లింగ్ (14)తో నాలుగో వికెట్‌కు 26, టకెర్ (27 నాటౌట్)తో ఐదో వికెట్‌కు అజేయంగా 72 రన్స్ జత చేసి గెలిపించాడు. నవీద్ జద్రాన్ 2 వికెట్లు తీశాడు. మార్క్ అడైర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.