మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన

మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన

వచ్చే ఏడాది జనవరిలో మలేషియా వేదికగా మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. మొత్తం 16 జట్లు టైటిల్ కోసం తలపడుతుండగా.. ఈ పదహారింటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆతిథ్య మలేషియాతో కలిసి భారత మహిళల జట్టు గ్రూప్- 'ఏ'లో ఉంది.

ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఆయా దేశాలు ఒక్కొక్కటిగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తమ స్క్వాడ్ ప్రకటించగా.. తాజాగా ఐరిష్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు గల బలమైన జట్టును ఐరిష్ బోర్డు ఎంపిక చేసింది. కెప్టెన్‌గా అమీ హంటర్ ని నియమించిన సెలెక్టర్లు.. ఆమెకు డిప్యూటీగా నియామ్ మాక్‌నల్టీని ఎంపిక చేశారు.

ALSO READ | రోహిత్ శరీరాకృతిని చూడండి.. ఫిట్ కాదు అధిక బరువు: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్

ఐర్లాండ్ అండర్-19 మహిళల జట్టు:

అమీ హంటర్ (కెప్టెన్), అబ్బి హారిసన్, జెన్నిఫర్ జాక్సన్, నియామ్ మాక్‌నల్టీ (వైస్-కెప్టెన్), ఐమీ మాగ్వైర్, లారా మెక్‌బ్రైడ్, కియా మెక్‌కార్ట్నీ, ఎల్లీ మెక్‌గీ, జూలీ మెక్‌నల్లీ, లూసీ సార్జెంట్, మిల్లీ స్పెన్స్, అన్నాబెల్ స్క్వైర్స్, ఆలిస్ టెక్టర్, ఆలిస్ వాల్ష్.

ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్: రెబెక్కా లోవ్.

2025, జనవరి 18 నుండి మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. గతేడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రారంభ ఎడిషన్‌లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.

  • గ్రూప్ A: మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్‌, టీమిండియా 
  • గ్రూప్ B: పాకిస్తాన్, ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా 
  • గ్రూప్ C: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా
  • గ్రూప్ D: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్