![జింబాబ్వేపై ఐర్లాండ్ గెలుపు](https://static.v6velugu.com/uploads/2025/02/ireland-cricket-team-secures-third-consecutive-win-in-test-format_6LghQWUHS7.jpg)
బులావయో (జింబాబ్వే) : ఐర్లాండ్ క్రికెట్ టీమ్ టెస్టు ఫార్మాట్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. జింబాబ్వేతో సోమవారం ముగిసిన ఏకైక టెస్టు పోరులో ఆ జట్టు 63 రన్స్ తేడాతో గెలిచింది. ఐర్లాండ్ ఇచ్చిన 292 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో చివరి రోజు జింబాబ్వే 86.3 ఓవర్లలో 228 రన్స్‌కే ఆలౌటైంది. వెస్లీ మధెవెరె (84) ఒంటరి పోరాటం చేశాడు. ఐరిష్ బౌలర్లలో మాథ్యూ హంఫ్రేయ్స్ ఆరు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.
ఆండీ మెక్‌బ్రైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 2017లో ఐసీసీ శాశ్వత సభ్యత్వహోదా దక్కించుకొని టెస్టు క్రికెట్ ఆడుతున్న ఐర్లాండ్ తమ తొలి ఏడు టెస్టుల్లో ఓడిపోయింది. గతేడాది అఫ్గానిస్తాన్‌పై తొలి విజయాన్ని అందుకున్న ఆ జట్టు జింబాబ్వేపై వరుసగా రెండు సార్లు గెలిచింది.