IPL 2025: హద్దు మీరిన ప్రవర్తన.. కామెంట్రీ ప్యానల్‌లో ఇర్ఫాన్ పఠాన్‌కు నో ఛాన్స్

IPL 2025: హద్దు మీరిన ప్రవర్తన.. కామెంట్రీ ప్యానల్‌లో ఇర్ఫాన్ పఠాన్‌కు నో ఛాన్స్

ఐపీఎల్ 2025 మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరుతో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి మ్యాచ్ లో తలపడబోతుంది.ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తమ కామెంట్రీతో మ్యాచ్ ను మరింత  వినోదాన్ని పంచడానికి మాజీ క్రికెటర్లు సిద్ధమయ్యారు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను పది వేర్వేరు భాషల్లో ప్రసారం చేస్తుంది. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్, పొమ్మీ మ్బాంగ్వా వంటి టాప్ కామెంటేటర్లు ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ లిస్ట్ లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పేరు లేకపోవడం విశేషం. 

ALSO READ | KKR vs RCB: ఓపెనర్లుగా కోహ్లీ, సాల్ట్.. మిస్టరీ స్పిన్నర్లతో కేకేఆర్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే!

ప్రతి సీజన్ లో కామెంట్రీ చేసే పఠాన్ ఈ సారి  కామెంట్రీ ప్యానెల్‌లో అతని పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. పఠాన్ గతంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కొంతమంది ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతని వైఖరి ఎవరికీ నచ్చలేదని సమాచారం. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై పఠాన్ విమర్శలు కురిపించేవాడట. బీసీసీఐ కూడా ఈ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ పై అసంతృప్తిగా ఉందని.. అందుకే అతన్ని కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. 

పఠాన్ వ్యాఖ్యానం చాలా మంది క్రికెటర్లు ఇబ్బంది కలిగించిందని.. అతనిపై కొంతమంది క్రికెటర్లు ఫిర్యాదు చేశారని కొన్ని వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియన్ సిరీస్ జరుగుతున్న సమయంలో ఒక స్టార్ ఆటగాడు పఠాన్ కామెంట్రీపై తీవ్ర నిరాశకు గురయ్యాడని.. దీంతో  అతని ఫోన్ బ్లాక్ చేశాడని తెలుస్తుంది. పఠాన్ తో పాటు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా కొంతమంది క్రికెటర్ల గురించి చెడుగా మాట్లాడినందుకు బీసీసీఐ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, హర్యాన్వి బాషలలో ఐపీఎల్ కామెంట్రీ ప్రసారం అవుతుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricShadow (@cricshadow)

నేషనల్ ఫీడ్ వ్యాఖ్యాతలు:

సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, మైఖేల్ క్లార్క్, మాథ్యూ హేడెన్, మార్క్ బౌచర్, ఆర్పీ సింగ్, షేన్ వాట్సన్, సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, వరుణ్ ఆరోన్, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్, షిక్ ద్వాన్, హర్భవాన్ జడేజా రైనా, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, రాబిన్ ఉతప్ప, ఆరోన్ ఫించ్, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా.

వరల్డ్ ఫీడ్ వ్యాఖ్యాతలు:

రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, దీప్ దాస్‌గుప్తా, షేన్ వాట్సన్, మైఖేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్, వరుణ్ ఆరోన్, అంజుమ్ చోప్రా, డబ్ల్యూవీ రామన్, మురళీ కార్తీక్, ఇయోన్ మోర్గాన్, గ్రేమ్ స్వాన్, హర్ష భోగ్లే, సైమన్ డౌల్, మ్పుమెలెలో మ్బాంగ్వా, నిక్ నైట్, డానీ మోరిసన్, ఇయాన్ బిషప్, అలాన్ విల్కిన్స్, డారెన్ గంగా, కేటీ మార్టిన్, నటాలీ జర్మానోస్.

తెలుగు ఫీడ్ వ్యాఖ్యాతలు:
 
అంబటి రాయుడు, ఎంస్కె ప్రసాద్, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, హనుమ విహారి, ఆర్. శ్రీధర్, అక్షత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కొల్లారం, విజే  శశి.