బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్

బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో  ఐదు సిక్సులు,ఒక ఫోర్

పొట్టి క్రికెట్ అంటేనే రికార్టుల మీద రికార్డులు, సెంచరీలు నమోదవుతాయి. చాన్స్ వస్తే చాలు దుమ్ముదులుపడానికి రెడీగా ఉంటారు. మరీ ముఖ్యంగా యువ బ్యాటర్స్ అయిటే రెచ్చిపోయి ఆడతారు.  లేటెస్ట్ గా ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ ఒకే ఓవర్లో 34 పరుగులు బాదాడు. ఇపుడు ఈ వీడియో సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

బర్మింగ్ హామ్ బేరర్స్,నార్తాంప్టన్ షైర్ మధ్య  జరిగిన టీ20లో  ఐర్లాండ్ కు చెందిన పార్ల్ స్టీరింగ్ అనే క్రికెటర్ ఒకే ఓవర్లో 5 సిక్సులు, ఒక ఫోర్ తో 34 రన్స్ చేశాడు. 46 బంతుల్లోనే సెంచరీ చేసిన అతడు.. మొత్తం 51 బంతుల్లో9 ఫోర్లు 10 సిక్సులతో  119 పరుగులు చేశాడు. జేమ్స్ సాల్స్ అనే బౌలర్ కు చుక్కలు చూపించాడు ఈ మ్యాచ్ లో నార్తాంపట్న్ షైర్ 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది.