హైదరాబాద్ లో మరో 2 అంతరాష్ట్ర గంజాయి ముఠాలను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 164 కేసుల్లో 51 లక్షలు విలువైన గంజాయి సీజ్ చేశామన్నారు డీసీపీ రేష్మి పెరుమాల్. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రవి, సయ్యద్, ఆనంద్ రామ్జీ అనే డ్రగ్ ఫెడ్లర్ ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీళ్ల నుంచి 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించామన్నారు.
మరో కేసులో భవాని నగర్ ఎస్పీ పరిధిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు డీసీపీ. నిందితుల దగ్గర 64 కేజీల గంజాయి పట్టుకున్నామన్నారు. గతంలో వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు ఉన్నాయన్నారు. ఒడిశా నుంచి బస్సులో హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు చెప్పారు. ముగ్గురు నిందితులను విచారణ కోసం భవాని నగర్ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాల్