హైదరాబాద్ హోటళ్లు నిర్లక్ష్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నాయి. రోజుకో హోటల్లో వెలుగులోకి వస్తున్న సంఘటనలు బయటి ఫుడ్ గురించి ఆలోచించాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బిర్యానీలో బొద్దింకలు, పురుగులు వచ్చిన ఘటన మరువక ముందే.. మరో హోటల్లో పూరి కర్రీలో ఇనుప ముక్క ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాచిగూడ చౌరస్తా లోని స్వీకార్ హోటల్లో టిఫిన్ ఓ కస్టమర్ పూరి కర్రిలో చిన్న ఇనుప ముక్కలు ప్రత్యేక్షం కావడంతో కంగుతిన్నాడు.
తన ఆకలినీ తీర్చుకోవడానికి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వీకర్ హోటల్ లో టిఫిన్ చేయడానికి ఆర్డర్ ఇవ్వగా... పూరి కర్రిలో ఇనుప ముక్కలు వచ్చాయని తెలిపారు కస్టమర్. ఇదేంటని హోటల్ సిబ్బందిని నిలదీయగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా...ఏమి చేసుకుంటారో చేసుకో అని సమాధానం ఇచ్చారని వాపోయారు.
Also Read:-మోక్షజ్ఞ సినిమా వాయిదా... అంతా మనమంచికే అంటున్న బాలకృష్ణ..
ఈ విషయంపై అంబర్ పెట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ హేమలత కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కస్టమర్. తినే ఆహారం పై శ్రద్ధతీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటల్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్లు.