కామారెడ్డి టౌన్, వెలుగు : ఓ బిల్డింగ్ పై పనిచేస్తున్న కూలి గుంతలో పడిపోవడంతో అతని గొంతులో ఇనుప చువ్వ గుచ్చుకుంది. కామారెడ్డి టౌన్ శివారులోని అడ్లూర్పరిధిలో ఉన్న ధరణి టౌన్షిప్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. దోమకొండ మండలం అంబారీపేట్‌కు చెందిన జనార్ధన్ బిల్డింగ్‌పై పనిచేస్తుండగా పక్కనున్న గుంతలో పడ్డాడు.
ఆ గుంతలో ఇనుప చువ్వలు ఉండడంతో ఒక చువ్వ జనార్ధన్ గొంతులోకి దిగింది. చుట్టుపక్కల వారు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. ఇక్కడ కటింగ్ మెషీన్ సాయంతో ఇనుప చువ్వ బయటకు తీశారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ హాస్పిటల్‌కు తరలించారు.