పిల్లలు బిస్కెట్లు అడగ్గానే కొనిచ్చేస్తున్న తల్లిదండ్రులందరికీ హెచ్చరిక లాంటిది ఈ కథనం. పిల్లలు మొదలు పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్‌లో ఐరన్ వైర్ దర్శమిచ్చింది. తినే ముందు సదరు పిల్లాడు దానిని( ఇనుప తీగ) గమనించడంతో పెద్ద అపాయం తప్పింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
కామారెడ్డి జిల్లా, దేవునిపల్లికి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యక్తి తన పిల్లలకు స్థానిక దుకాణంలో బోర్బన్ బిస్కెట్ ప్యాక్ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి పిల్లలు ప్యాక్ ఓపెన్ చేసి బిస్కెట్లు తింటుండగా సన్నని ఇనుప తీగ కనిపించింది. దాన్ని వారు తండ్రికి చూపెట్టడంతో.. అతను ఆ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read :- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు
తల్లిదండ్రులు తమ పిల్లలకు చిరుతిళ్లు తినిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే వారి ప్రాణానికే ముప్పు తేవచ్చని అతను వీడియోలో హెచ్చరించాడు. తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికి వీడియో పోస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
బోర్బన్ బిస్కెట్‌లో ఐరన్ వైర్..
— Govardhan Reddy (@SportsNewsInd24) October 11, 2024
తెలంగాణ, కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో కొనుగోలు చేసిన బోర్బన్ బిస్కెట్‌లో ఐరన్ వైర్ కనిపించింది.#BourbonBiscuit #Britannia pic.twitter.com/5McubGP6Tn