ఉపాధి హామీలో బయటపడ్డ అక్రమాలు

  •     ఉపాధి హామీలో బయటపడ్డ అక్రమాలు
  •     నెన్నెలలో రూ.99 వేలు దుర్వినియోగం 

కుభీర్/బెల్లంపల్లి రూరల్,వెలుగు: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు ఆగడంలేదు. నిర్మల్​ జిల్లా కుభీర్ ఎంపీడీవో ఆఫీస్  ఎదుట రెండు రోజులుగా చేపట్టిన సామాజిక తనిఖీలో మంగళవారం తెల్లవారు 2.30 గంటలకు ముగిసింది. మండలంలో మొత్తం రూ.27 కోట్ల మేర పనులు జరుగగా చేయని పనులకు రూ. 3.16  కోట్లకుపైగా చెల్లించారు. దుర్వినియోగమైన డబ్బుల రికవరీకి ఆదేశించామని డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి తెలిపారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది, ఆఫీసర్లకు రూ. 1.31 లక్షల ఫైన్​ విధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, వైస్ ఎంపీపీ మొహినొద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధి సిబ్బంది కూలీలు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో వారం పాటు జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలు బయటపడ్డాయి. మూడేళ్లలో జరిగిన పనుల్లో రూ.99 వేలు దుర్వినియోగం అయినట్లు డీఆర్డీవో  పీడీ శేషాద్రి తెలిపారు. రూ.63 వేలు రికవరీకి  ఆదేశించామని, అవినీతికి పాల్పడిన వారికి రూ.36 వేల ఫైన్​విధించినట్లు తెలిపారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, ఎంపీడీవో వరలక్ష్మి, ఏపీవో నరేశ్ పాల్గొన్నారు.