గడ్డిపల్లి కేవీకే నియామకాల్లో అక్రమాలు

డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకే కట్టబెట్టారని ఆరోపణలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఇటీవల నియమించిన ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కేవీకేలో పనిచేస్తున్న ఆఫీసర్లే డబ్బులు తీసుకొని అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు గత నెలలో ఐసీఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. దీంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో అప్లై చేసుకున్నారు. ఇటీవల రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ నిర్వహించి క్యాండిడేట్లను ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

అర్హత ఉన్న వారిని కాదని..

ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్ రూల్స్ ప్రకారం ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్ట్ కోసం అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీతో పాటు కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలి. అలాగే అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుకు ఏదైనా డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. అయితే కేవీకేలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ఎలాంటి కంప్యూటర్ అనుభవం లేకున్నా ప్రోగ్రాం అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు కేటాయించారు. అలాగే ఎంకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చార్టెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్హత ఉన్న వారిని కాదని బీకాం చదివిన మరో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగికి అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు కట్టబెట్టారు. వీటితో పాటు డ్రైవర్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 35 ఏళ్ల లోపు వారే అర్హులని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొనగా, కేవీకేలోనే పనిచేస్తున్న, 40 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్న ఓ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులో ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చి, ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయించి డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులో నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని అర్హత లేకున్నా పోస్టులు కట్టబెట్టారని, దీనిపై ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి కేటాయించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

ఎంక్వైరీ చేయాలి 

కేవీకేలోని మూడు పోస్టుల్లో అనర్హులను నియమించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. నియామకాలను రద్దు చేసి పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలి.

– ఉపేందర్, గడ్డిపల్లి

అర్హత ఉన్న వారినే నియమించాం 

ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. మెరిట్ ఆధారంగా అర్హత ఉన్న వారినే నియమించాం. కమిటీ ఆధ్వర్యంలోనే నియామకాలను చేపట్టం.

– లవకుమార్, 
కే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే, గడ్డిపల్లి