జగిత్యాల బల్దియా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బినామీల దందా..!

జగిత్యాల బల్దియా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బినామీల దందా..!
  • షాపులు తీసుకొని రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా ఇతరులకు ఇస్తున్న వైనం
  • బల్దియా నిర్ణయించిన రేటు కన్నా ఎక్కువ వసూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలాల్లోనూ చిరువ్యాపారుల పేరిట షెడ్లు 
  • కిరాయిలకు ఇస్తూ బల్దియా ఆదాయానికి గండి 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల బల్దియా ఆదాయం పెంచుకునేందుకు నిర్మించిన కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బినామీల దందా నడుస్తోంది. షాపులు దక్కించుకున్న కొందరు.. రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా ఇతరులకు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తూ వసూళ్లకు తెరతీశారు. మరోవైపు టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారులు కూడా రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా చెల్లించడంలేదు. 

ఇక బల్దియా ఖాళీ స్థలాల్లో కొందరు చిరువ్యాపారుల పేరిట పర్మిషన్​లేకుండా షెడ్లు వేస్తూ రెంట్లకు ఇస్తూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు. కాగా 25 ఏండ్లకు ఒకసారి టెండర్ వేయాల్సి ఉండగా.. ఇప్పటికే ఈ సమయం పూర్తయినట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న ఏరియాలో షెడ్లు 

జగిత్యాల కొత్త బస్టాండ్ ఇన్ గేట్ ఎదురుగా ఉన్న మున్సిపల్ పార్క్ జాగా కబ్జా కోరల్లో చిక్కుకుంది. కొన్నేళ్లుగా ఇక్కడ మున్సిపల్ భూమిలో కొందరు వ్యక్తులు షెడ్లు వేశారు. జిల్లా కేంద్రంగా మారాక భూముల విలువ పెరగడంతో పాటు బస్టాండ్ ఏరియా కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో డిమాండ్​పెరిగింది. ఇక్కడ షెడ్లు నిర్మించి.. నెలకు రూ. 10 వేల నుంచి రూ.16 వేల వరకు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తున్నారు. 

Also Read :- కోట్లు పెట్టి కట్టి.. ఉత్తగనే పెట్టిన్రు !

జగిత్యాల బల్దియా పరిధిలోని బల్దియా స్థలాలతోపాటు ఖాళీ గా ఉన్న ఆర్టీసీ, రెవెన్యూ స్థలాలను గుర్తించి కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే కోట్లు విలువైన స్థలాలను కాపాడుతూ, ఆయా ప్రభుత్వ శాఖలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.  

రూ.కోటిన్నరకు  వసూలయ్యేది రూ.అరకోటే.. 

జగిత్యాల బల్దియాలోని కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 191 షెటర్లు ఉన్నాయి. బల్దియా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 59 షెటర్లు, పార్క్ కాంప్లెక్స్ లో 34 షెటర్లు, ఎంపీడీవో కాంప్లెక్స్ లో 11, టౌన్ హాల్ కాంప్లెక్స్ లో 15, అంగడి బజార్ కాంప్లెక్స్ లో 72 షెటర్లు ఉన్నాయి. వీటిని టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కేటాయించారు. వీరిలో 45 శాతానికి పైగా ఆయా షెటర్లలో బిజినెస్ చేసుకోగా, మిగితా 55 శాతానికి పైగా ఇతరులకు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చి బల్దియా నిర్ణయించిన రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్నా అదనంగా రూ. 2 వేల నుంచి రూ.6వేల వరకు వసూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

ఈ కాంప్లెక్సుల ద్వారా ఏటా సుమారు రూ. కోటిన్నరకు పైగా రెంట్ రూపంలో బల్దియాకు ఆదాయం రావాల్సి ఉండగా.. రూ.అరకోటి కూడా దాటడం లేదని బల్దియా అధికారులు చెబుతున్నారు. రూల్స్ ప్రకారం 25 ఏళ్లకు ఒకసారి టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉండగా.. ఆ దిశగా అడుగులు పడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపట్టి రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తున్న షెట్టర్లను గుర్తించి రీ టెండర్ వేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.