శంషాబాద్లో చెరువులు కబ్జా .. హైడ్రాకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు

కబ్జాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. శంషాబాద్ లో కబ్జాలకు గురైన కామునిచెరువు, ఫిరంగినాలా, పాలమాకుల పెద్ద చెరువుపై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత జలపల్లి నరేందర్. గత ప్రభుత్వ పెద్దల అండతో FTL, బఫర్ జోన్లలో అనేక అక్రమాలు వెలిశాయని పేర్కొన్నారు. 

ఫిరంగినాలాను అపర్ణ కన్ స్ట్రక్చన్, సుమధుర కన్ స్ట్రక్చన్ సంస్థలు కబ్జాచేసి భారీ నిర్మాణాలు చేపట్టాయని..దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. చెరువులన్నీ కబ్జాలకు గురికావడంతో వర్షాలు పడ్డప్పుడు..చెరువులకు వెళ్లాల్సిన నీరు..కాలనీలకు చేరి ముంచెత్తుతున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటికైనా కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.