కాంట్రాక్టర్ తో ఏఈ కుమ్మక్కైబిల్లులు కాజేశారు : కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షాహిద్

కోటగిరి, వెలుగు: కోటగిరిలో ముస్లింల స్మశాన వాటిక చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షాహిద్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

 ప్రహారీ గోడ నిర్మాణం కోసం రూ.25 లక్షల నిధులు కేటాయించగా, కాంట్రాక్టర్ కేవలం 97 పిల్లర్లతో గోడ నిర్మించి 111 పిల్లర్లతో నిర్మించినట్లు నిధులు విడుదలయ్యేలా ఏఈ సహకరించారన్నారు. ఉన్నతాధికారులు వెంటనే ఎంక్వయిరీ చేసి కాంట్రాక్టర్‌‌, ఏఈలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఎంపీటీసీ కొట్టం మనోహర్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్, డీసీసీ డెలిగేట్ హన్మంతు, ఆనంద్, మైనార్టీ లీడర్లు హైమద్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.