పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి మండలం బంధంపల్లి చెరువు బఫర్‌జోన్‌లోని అక్రమ నిర్మాణాలను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు. కలెక్టర్ ఆదేశాలతో వారం రోజులుగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగుల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్‌లో కబ్జాలను అధికారులు గుర్తించారు.
ఈక్రమంలో పెద్దపల్లి మండల పరిధిలోని బంధంపల్లి చెరువు సమీపంలోని బఫర్‌జోన్‌లోని షెడ్లను కూల్చివేశారు. వెంచర్చుట్టూ ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాల్‌ను కూడా కూల్చివేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు.