- పిల్లర్ల కింది ఇసుక కొట్టుకపోవడంతోనే కుంగిన బ్యారేజీ: ఈఎన్సీ అనిల్
- మూడు బ్యారేజీల వద్ద రిపేర్ వర్క్స్ చేపట్టాం
- ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలు వచ్చే వరకు గేట్లు ఓపెన్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కింద బుంగ పడింది వాస్తవమేనని ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ అనిల్ కుమార్ అంగీకరించారు. బుంగ పడి పియర్స్కింది ఇసుక కొట్టుకపోవడం వల్లే బ్యారేజీ భూమిలోకి కుంగిందని చెప్పారు. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈఎన్‌సీ అనిల్ కుమార్ మాట్లాడారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల ప్రకారం మూడు బ్యారేజీల వద్ద రిపేర్ వర్క్స్ చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో బ్యారేజీలు డ్యామేజీ కాకుండా టెంపరరీ వర్క్స్ ఏంచేయాలి? పర్మినెంట్ వర్క్స్ ఏం చేయాలి? అనే విషయాలపై టెస్ట్‌లు జరుపుతున్నట్టు వివరించారు.
మళ్లీ ఎన్‌డీఏస్‌ఏ ఆదేశాలు వచ్చే వరకు మూడు బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి పెడతామని చెప్పారు. గోదావరిలో వరద వచ్చే టైంలో కన్నెపల్లి పంప్‌హౌజ్ దగ్గర వాటర్ ఫ్లో అధికంగా ఉంటుందని, ఆ సమయంలో మోటర్లు ఆన్ చేసి వాటర్ లిఫ్ట్ చేసుకోవచ్చని అన్నారు. ఫ్లడ్ తగ్గినంక గోదావరిలో జియోట్యూబ్స్ వేసి, వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ రికమండేషన్స్ ఆధారంగా బ్యారేజీ డ్యామేజీ కాకుండా, వారు సూచించిన పనులన్నీ చక చకా పూర్తి చేస్తున్నామని తెలిపారు. జీఆర్పీ యాప్రాన్ కింద ఉన్న వాటర్‌ని డివాటరింగ్ చేసి, కెమికల్ సిమెంట్ ఇసుక మిక్సింగ్ చేస్తూ ఫిలప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్ టీ పనులు, సీకెంట్ పైల్స్, ఇంటిగ్రేటెడ్ పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. 3 బ్యారేజీల్లో మేడిగడ్డ, అన్నారంలో రిపేర్ వర్క్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని తెలిపారు.
స్లోగా సుందిళ్ల పనులు
సుందిళ్ల పనులు స్లోగా జరుగుతున్నాయని, వేగం పెంచాలని మంత్రిఆదేశించారని ఈఎన్సీ అనిల్ తెలి పారు. అన్నారం పంపుహౌస్ నుంచి వాటర్ పంపింగ్ కోసం 11 మీటర్ల ఎత్తులో, సుందిళ్లలో 13 మీటర్ల హైట్ లో వాటర్ ఆపాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకొని, వచ్చే సీజన్ నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే ప్రయత్నాలు చేస్తున్నామని ఈఎన్సీ వివరించారు.
మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కుంగిన ఏడో బ్లాకులో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎల్ అండ్ టీ ప్రతినిధి సురేశ్ కుమార్ తెలిపారు. 41 మంది స్టాఫ్, 150 మంది వర్కర్లతో పలు రకాల మిషనరీ తో వర్క్స్చేస్తున్నామని చెప్పారు. జీపీ ఆర్ ప్రకారం సిమెంట్, సాండ్ గ్రౌటింగ్ వర్క్ 80% పూర్తయిందని వివరించారు. సాండ్ బ్లాక్ 60%, షీట్ ఫైల్స్ వర్క్ 40% పూర్తయినట్టుగా చెప్పారు.