
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ డ్యామ్‌పై టవర్ క్రేన్లు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. స్పిల్ వే మరమ్మతుల సమయంలో కిందకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో క్రేన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. టవర్ క్రేన్ల ఏర్పాటుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించింది.
ఆసక్తి గల సంస్థలు ఒక్కో టవర్ క్రేన్ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో కొటేషన్ ఇవ్వాలని పేర్కొంటూ నాగార్జునసాగర్ హిల్ కాలనీ సర్కిల్ ఎస్‌ఈ శ్రీధర్ రావు నోటిఫికేషన్ఇచ్చారు. ట్యాక్సులు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, ఇతర చార్జీలు అన్ని కలిపి కొటేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకసారి డ్యామ్‌ను సందర్శించి ఎన్ని క్రేన్లు అవసరమవుతాయో.. వాటికి ఎంత ఖర్చవుతుందో చెప్పాలని తెలిపారు. కొటేషన్లను మార్చి 7వ తేదీ వరకు సాయంత్రం 4 గంటల్లోపు పంపించాలని సూచించారు.