జులై 1న బాబ్లీ గేట్లను తెరవనున్న ఇరిగేషన్ శాఖ అధికారులు

 జులై 1న బాబ్లీ గేట్లను తెరవనున్న ఇరిగేషన్ శాఖ అధికారులు

నిజామాబాద్ : జులై 1న బాబ్లీ గేట్లను ఇరిగేషన్ శాఖ అధికారులు తెరవనున్నారు. తెలంగాణ-, మహారాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర జలవనరులశాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ గేట్లను తెరవనున్నారు. శనివారం (జులై 1) నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచనున్నారు. 

బాబ్లీతో పాటు ఎగువన ఉన్న విష్ణుపురి, గైక్వాడ్, ప్రాజెక్టులు ఖాళీగా ఉండటంతో ఈసారి గేట్లు ఎత్తినా చుక్కనీరు వచ్చే పరిస్థితి లేదంటున్నారు అధికారులు. భారీ వర్షాలు కురిస్తే తప్ప..  శ్రీరాంసాగర్ కు వరద వచ్చే అవకాశం లేదంటున్నారు ఎస్సారెస్పీ అధికారులు.