- ఇంకా ఎన్ని రోజులు చేస్తరు
- ఇంజినీర్లపై ఎందుకు చర్య తీసుకోవద్దు
- సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మతు పనుల్లో జాప్యంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంకా ఎన్నిరోజులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారు. పనుల్లో జాప్యానికి కారణమైన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలుపాలన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద నాగర్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది.
ALSO READ | పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే
గండి పూడ్చివేత పనులు గత వారం ప్రారంభమయ్యాయి ఆ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. గండిపూడ్చివేత పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పూడ్చివేత పనులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.