చివరి ఆయకట్టు దాకా సాగునీరందించాలి

చివరి ఆయకట్టు దాకా సాగునీరందించాలి

హనుమకొండసిటీ, వెలుగు: చివరి ఆయకట్టుదాకా సాగు నీరిందించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ నుంచి వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరిసాగవుతోందని, ఎగువ భాగాన రైతులు ఎక్కువ మోటార్లు పెడుతున్నారన్నారు. ఈ కాన్ఫరెన్స్​లో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి,సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇరిగేషన్, వ్యవసాయశాఖాధికారులు పాల్గొన్నారు.