66 ఫీట్ల ఫిరంగి నాలా కబ్జా..జన్వాడ ఫామ్ హౌస్ సర్వేలో సంచలనం

66 ఫీట్ల ఫిరంగి నాలా కబ్జా..జన్వాడ ఫామ్ హౌస్ సర్వేలో సంచలనం

జన్వాడ ఫామ్‌హౌస్ దగ్గర మరోసారి సర్వే చేస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు.  ఆరుగురు అధికారుల బృందం సర్వే చేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ఫిరంగి నాలాను  భారీ బందోబస్తు మధ్య సర్వే చేస్తున్నారు. శంకర్ పల్లి మండలం బుల్కా పూర్ గ్రామం నుంచి మొదలైన ఈ ఫిరంగి నాలా జన్వాడ గ్రామ రెవెన్యూలోని  కేటీఆర్  ఫామ్ హౌస్ ముందు నుంచి వెళ్తుంది. ఈ ఫిరంగి నాలా పరిధిలోనే  కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో  ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నాలా సుమారు 66 ఫీట్లు ఉండేదని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు  కబ్జాకు గురైంది.? బఫర్ జోన్ ఎంత వరకు ఉందనే  సమాచారాన్ని సేకరిస్తున్నారు అధికారులు.

ALSO READ | ఎంత పెద్ద వాళ్లైనా వదలం.. ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గం: సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవలే  ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ ను పరిశీలించి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే జన్వాడ ఫాంహౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేత, కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి. ఐతే సిటీలో చెరువుల కబ్జా,  ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నంబర్‌‌ 311 (311/7)లో 1,210 చదరపు గజాల్లోని 3,894 చదరపు అడుగులతో నిర్మించిన ఫామ్​హౌస్‌‌ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదన్నారు.  తన ఫ్రెండ్ ఫామ్ హౌజ్ ను  లీజుకు తీసుకున్నానని చెప్పారు.