ఎస్సారెస్పీ స్టేజ్​2, నీల్వాయిపై

ఎస్సారెస్పీ స్టేజ్​2, నీల్వాయిపై
  • ఇరిగేషన్​ అధికారుల ఫోకస్
  • పనులు త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: ఎస్సారెస్పీ స్టేజ్​ 2, నీల్వాయి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఇరిగేషన్​అధికారులు కసరత్తు చేస్తున్నారు. యాక్సిలరేటరీ ఇరిగేషన్​ బెనిఫిట్​ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద కేంద్రం ఇదివరకే ఈ రెండు ప్రాజెక్టులను ఎంపిక చేసింది. తాజాగా ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు కలిసి రివ్యూ చేశారు. ఎస్సారెస్పీ స్టేజ్​2కు అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని నిర్ణయించారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 40 వేల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక, నీల్వాయి ప్రాజెక్టుకు ఇటీవల ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేయగా.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.18 కోట్లు అవసరమవుతాయని రివ్యూలో అధికారులు చర్చించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. దాంతో పాటు కాళేశ్వరం మూడో టీఎంసీపైనా అధికారులు ఇంటర్నల్​ రివ్యూ నిర్వహించినట్టు తెలిసింది.