రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ ఫాంహౌస్ పై సర్కార్ యాక్షన్ షురూ అయింది. ఫాంహౌస్ ను పరిశీలించారు ఇరిగేషన్ అధికారులు. ఫాంహౌస్ ను కొలుస్తున్నారు అధికారులు, సిబ్బంది.
Also Read :- కవితకు బెయిల్.. పార్టీల మధ్య పంచాది
ఇప్పటికే జన్వాడ ఫాంహౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేత, కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి. ఐతే సిటీలో చెరువుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నంబర్ 311 (311/7)లో 1,210 చదరపు గజాల్లోని 3,894 చదరపు అడుగులతో నిర్మించిన ఫామ్‌హౌస్ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదన్నారు. తన ఫ్రెండ్ ఫామ్ హౌజ్ ను లీజుకు తీసుకున్నానని చెప్పారు.