ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరకొర కేటాయింపులు

  •     అడిగింది రూ.1,497 కోట్లు... ఇచ్చింది రూ.648.23 కోట్లు
  •     పెండింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులకు రూ.542 కోట్లు, ఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 
  • భూ సేకరణకు రూ. 106 కోట్లు
  •     సాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ.200 కోట్లే కేటాయింపు

నల్గొండ, వెలుగు : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రాజెక్టులకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. గత ఆర్థిక సంవత్సరంలో పనులు జరిగి ఆగిపోయిన బిల్లులతో పాటు, ఫారెస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని ప్రాజెక్టులకు, నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. నాగార్జునసాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపఎన్నికల్లో భాగంగా సీఎం ప్రకటించిన లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంలకు పెద్దగా కేటాయింపులు జరగలేదు. నేషనల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదంలో ఇరుక్కున్న డిండి లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంకు ఈ బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులు పూర్తిగా తగ్గించారు. డిండి కింద నిర్మిస్తున్న నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్ల పనులు ఇప్పట్లో స్టార్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేలా కనిపించడం లేదు. ఫారెస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాక నక్కలగండి మధ్యలోనే ఆగింది. పెండ్లిపాకల రిజర్వాయర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్టర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతులెత్తేయడంలో మళ్లీ టెండర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలవాల్సి ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న శ్రీశైల సొరంగ మార్గానికే ఈ ఏడాది సుమారు వెయ్యి కోట్లు కావాల్సి ఉంది. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం రూ.3 వేల కోట్లకు చేరింది. కానీ ఈ బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సొరంగ మార్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాకపోతే ఎస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ, ఏఎమ్మార్పీ కింద రూ.220 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కాల్వల రిపేర్లు, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్​ పనులు పూర్తయ్యే అవకాశంకనిపిస్తోంది. 

ప్రాజెక్టులు ప్రశ్నార్ధకమే...

ఏఎమ్మార్పీ, ఎస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ, డిండి లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగార్జునసాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులకు కలిపి ఈ సంవత్సరం రూ.1,495 కోట్లు కావాలని ప్రపోజల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. కానీ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.648 కోట్లకు తగ్గించాల్సి ఉంది. గత సంవత్సరం కూడా రూ.1,194 కోట్లు అడిగితే కేవలం రూ.648 కోట్లే ఇచ్చారు. అవసరాలను బట్టి మధ్యలో బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైవర్షన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది పేమెంట్స్​ రూ.900 కోట్ల వరకు జరిగాయని అంటున్నారు. ఇవిగాక తాజా బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన రూ.648 కోట్లలో పెండింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులకే రూ.542 కోట్లు చెల్లించాల్సి ఉండగా, భూసేకరణ, ఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ కింద మరో రూ.106 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ రకంగా అరొకర నిధులతో బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయింపులు చేస్తే ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుందని ఆఫీసర్లు అంటున్నారు.

సాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మరింత ఆలస్యం

నాగార్జునసాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో నిర్మిస్తున్న ఐదు లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వలు గరిష్ట స్థాయిలో ఉండడం వల్ల పనులు మధ్యలోనే ఆపేశారు. మరో వైపు ప్రభుత్వం సకాలంలో టెండర్లు పిలవకపోవడం, అగ్రిమెంట్లు కాకపోవడం, నిధుల సమస్యతో పనులు ఇప్పటికే రెండేళ్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన రూ.100 కోట్లు పెండింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులకే సరిపోతాయి. కొత్తగా మళ్లీ పనులు చేపట్టాలంటే నిధుల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఫారెస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పెండింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది.

వివాదంలో డిండి లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం

డిండి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం ఎన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ వివాదంలో ఇరుక్కుంది. ఈ వివాదం తేలితే తప్ప డిండి, దాని పరిధిలోని ఏడు రిజర్వాయర్లకు మోక్షం లభించదు. ఎన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ అనుమతి లేకుండా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినందుకు ఇప్పటికే ప్రభుత్వంపైన రూ.300 కోట్ల పెనాల్టీ పడింది. దీంతో రిజర్వాయర్ల పనులన్నీ ఎక్కడికక్కడే ఆపేశారు. ఎన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ వివాదం తేలాక, గెజిట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాకే పనులు మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదాన్ని ఎటూ తేల్చకుండా, బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిధు లు పెట్టినా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది చివరి నాటికి రిజర్వాయర్లు కంప్లీట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని ఆఫీసర్లు అంటున్నారు.

నేడు రిటైర్డ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇంజినీర్ల ఫోరం విజిట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నల్గొండ జిల్లాలో నడుస్తున్న ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంగళవారం రిటైర్డ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల ఫోరం జిల్లాలో పర్యటించనుంది. ఆ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాసుందర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీర్ల టీమ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయసముద్రం, ఎస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ, నక్కలగండి, శ్రీశైల సొరంగ మార్గం, సాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వలను పరిశీలిస్తారు.