అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్

అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్

సెప్టెంబర్లో వర్షాకాల సమావేశాలు పెట్టే అవకాశం
ఆ సమావేశాల్లోనే బిల్లు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్ ను అసెంబ్లీలో పెట్టి సభ ఆమోదంపొందేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండోవారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు పెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మంగళవారం రీ ఆర్గనైజేషన్ పై రివ్యూ చేసిన సీఎం.. అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను ఎందుకు రీ ఆర్గనైజేషన్ చేయాల్సి వస్తుందో ప్రజలందరికీ తెలిసేలా చెప్పాల్సి ఉందని సీఎం అన్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఇరిగేషన్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత అందుబాటులోకి వచ్చిన లిఫ్టులు, వాటి కింద అదనంగా సాగులోకి రానున్న భూమి తదితర వివరాలను ప్రజలకు వివరించనున్నారు. ఇంజనీర్లపై పనిభారం పెరుగుతున్న నేపథ్యంలోనే పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్టుగా చెప్పనున్నారు. గతంలో మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ అంటూ డిపార్ట్మెంట్లు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఒకే గూటికి రానున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను వాటర్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్ గా మార్చనున్నారు. ఈ వివరాలన్నీ సభలో పెట్టి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆలోగా రీఆర్గనైజేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రీఆర్గనైజేషన్ ముసాయిదా బిల్లుతో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇంజనీర్లను ఈ వర్క్ షాప్ కు ఆహ్వానించి కొత్తగా ఏర్పాటు చేయబోయే సర్కిళ్లు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు, ఏఈఈల పని విభజన, అధికారాలు, బాధ్యతలపై వివరించనున్నారు. ఈ వర్క్ షాపుకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. డిపార్ట్మెంట్ కు కొత్తగా ఇంజనీర్ పోస్టులతో పాటు వెయ్యి మందికి పైగా సిబ్బంది పోస్టులను శాంక్షన్ చేస్తున్నట్టు అసెంబ్లీలోనే ప్రకటించే అవకాశముంది.

For More News..

ఓటర్ల లిస్ట్‌లో సవరణకు చాన్స్

రిమ్స్ వార్డుల్లో ఎలుకలు.. రోడ్ల మీద పేషంట్లు..