లిఫ్ట్ ల ద్వారా సాగునీరు అందిస్తాం : టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు 

వెంసూరు, వెలుగు : వెంసూరు మండలంలో లిఫ్ట్ లను పూర్తి స్థాయిలోకి వాడుకలోకి తెచ్చి సాగునీరు అందిస్తామని స్టేట్ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. వెంసూరు మండలం లో ఎర్రసాని బంజరు, గూడూరు లిఫ్ట్ ల కింద ఉన్న కాల్వలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐడీసీ ద్వారా లిఫ్ట్ లను వాడుకలోకి తెచ్చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేశామని, వాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి అవ్వగానే వారం రోజులలో పనులు మొదలవుతాయని తెలిపారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.