రెండ్రోజుల్లో నారాయణపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాగునీరు : మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: రెండు రోజుల్లో గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం ధర్మారం మండలం నంది మేడారం వద్ద జరుగుతున్న రిపేర్​పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన ఈఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ వెంకటేశ్వర్లుతో చర్చించారు. రెండు రోజుల్లో రిపేర్లు పూర్తిచేసి నీటిని విడుదల చేస్తామని ఈఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఎమ్మెల్యేకు వివరించారు. ఆయన వెంట చొప్పదండి మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ-, గంగాధర జడ్పీటీసీ అనురాధ-, లీడర్లు  శ్రీనివాస్​రెడ్డి, యాదగిరి, రమేశ్​, చందు, తిరుపతి, అశోక్, గంగన్న, తదితరులు ఉన్నారు. 

చొప్పదండి, వెలుగు: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మూడేండ్లుగా పెండింగ్​బిల్లులు రావడం లేదని, వెంటనే మంజూరు చేయించాలని మండలంలోని సర్పంచులు ఎమ్మెల్యే సత్యం దృష్టికి తీసుకెళ్లారు. చొప్పదండి మండల పరిషత్​లో గురువారం ఎంపీపీ రవీందర్​ అధ్యక్షతన జనరల్​బాడీ మీటింగ్​ నిర్వహించారు.