భారతదేశంలో ఐఆర్ఎస్ వ్యవస్థ మొదటిసారిగా 1998లో ఐఆర్ఎస్–1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభమైంది. ఒక వస్తువు నుంచి వచ్చే వికిరణం ఆధారంగా ఆ వస్తువు లక్షణాలను, దూరాన్ని తెలుసుకోవడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటారు. ఈ ఉపగ్రహాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం రెజల్యూషన్ శక్తి. రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచే స్పష్టంగా చూడటాన్ని రిజల్యూషన్ శక్తి అంటారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లో సెన్సర్లు సేకరించిన సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు పంపిస్తారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నేషనల్ నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహిస్తుంది. గ్రామీణ, పట్ఠణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వాతావరణ సమాచార సేకరణకు, విపత్తుల నిర్వహణకు, రవాణా వ్యవస్థ మెరుగుదలకు ఉపరితల చిత్రీకరణకు ఉపయోగిస్తారు. ఈ ఉపగ్రహాలను 500 – 1500 కి.మీ.ల కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి పీఎస్ఎల్వీ నౌకలను ఉపయోగిస్తారు.
మన దేశంలో రిమెట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లో ఉపయోగిస్తున్న సెన్సర్లు, స్కానర్లల్లో ముఖ్యమైనవి.
1. లీనియర్ ఇమేజింగ్ సెల్ప్స్కానర్
2. అడ్వాన్స్ డ్ వైడ్ఫీల్డ్ సెన్సర్స్
3. మాడ్యులర్ ఆప్టో ఎలక్ట్రానిక్ స్కానర్
4. ఓసియన్ కలర్ మానిటర్
5. పాంక్రోమాటిక్ కెమెరా