పంట ఉత్పత్తుల ఎగుమతి సమస్యలను తీరుస్తాం..

కాశీబుగ్గ, వెలుగు: స్థానిక రైతుల పండించిన ఉత్పత్తులను రవాణ చేసేందుకు వ్యాగన్లను తెస్తామని ఐఆర్​టీఎస్​ ప్రిన్సిపల్​ చీఫ్ కమర్షియల్​ మేనేజర్​ కేఆర్​కే రెడ్డి తెలిపారు. వరంగల్ చాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఆఫీస్​లో సౌత్​ సెంట్రల్​ రైల్వే బిజినెస్​ డెవలప్మెంట్​ యూనిట్​తో బుధవారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి, కాటన్​, రైస్​, మిర్చీని వరంగల్​ నుంచి ఎగుమతి చేయడంలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పై రివ్యూ చేశారు. 

రోడ్డు మార్గాల్లో ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా ఓవర్​ లోడ్​, పెనాల్టీలతో నష్టం కలుగుతున్నట్టు తెలిపారు. చింతలపల్లి గూడ్స్​ సైడింగ్​ను కంటైనర్​ టర్మినల్​గా మార్చితే సరుకులు రవాణకు సౌకర్యంగా ఉంటుందని , ఆ దిశగా ఏర్పాట్లు   చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్​ టీసీఎం బస్వరాజు, చీఫ్​ కమర్షియల్​ మేనేజర్​ రమేశ్​​ బాబు, సౌత్​ సెంట్రల్​ రైల్వే ఆఫీసర్లలు, వ్యాపారస్తులు అల్లె సంపత్​ పాల్గొన్నారు.