లెటర్​ టు ఎడిటర్​ : మూడోసారి కూడా దళిత సీఎం వట్టిదేనా?

లెటర్​ టు ఎడిటర్​ :  మూడోసారి కూడా దళిత సీఎం వట్టిదేనా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితున్ని తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడు. పదేండ్లు సీఎం సీటుపై కూర్చున్నాక కూడా కెసిఆర్​కి సీఎం పదవిపై ఇంకా మోజు తీరనట్టున్నది. తాజా ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్​ఎస్​దే  హ్యాట్రిక్ విజయం అని, కేసీఆర్ నే హ్యాట్రిక్  సీఎం అని నాయకులందరూ ప్రచారం చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు సీఎంగా కేసీఆర్ పదేండ్లు  పదవిని అనుభవించి రికార్డు సృష్టించారు. 

దళితులకు సీఎం హామీతో పాటూ, మూడెకరాల భూమిపై కూడా మాట తప్పారు. దళిత బంధుని కూడా తుతూ మంత్రంగానే అమలు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్రంలో పత్తా లేకుండా పోయింది. ఇప్పటికైనా బీఆర్​ఎస్​ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దళితున్ని సీఎం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ తప్పనిసరిగా తన పదవిని త్యాగం చేయాలి. 

దళిత ప్రజలు కూడా దళిత సీఎం హామీపై బీఆర్​ఎస్​ పార్టీతో పోరాడాలి. దళితులు  వారి హక్కులపై, వారికి ఇచ్చిన హామీలపై పెదవి విప్పాలి. మాట తప్పిన కేసీఆర్​తోపాటు, ఆ పార్టీ అభ్యర్థుల్ని రానున్న ఎన్నికల్లో మట్టి కరిపించాలి.

-పసునూరి శ్రీనివాస్,
మెట్​పల్లి, జగిత్యాల