
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "అఖండ 2: తాండవం" లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ చెయ్యాలని బోయపాటి బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రయాగరాజ్ లోని కుంభమేళాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరీ పాత్రలో నటిస్తున్నాడు.
అయితే అఖండ 2లో బాలకృష్ణ కి విలన్ గా తమిళ్ ప్రముఖ హీరో ఆది పినిశెట్టిని సెలెక్ట్ చేసినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను గతంలో తెలుగులో తీసిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. అయితే హీరో అల్లు అర్జున్ తోపాటూ ఆది పినిశెట్టిని కూడా అంతే పవర్ ఫుల్ గా చూపించాడు.
ALSO READ | Mrs Movie: అత్తారింట్లో.. కొత్త కోడలి కష్టాలు చివరికి ఏమైంది.?
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మరోసారి విలన్ గా అఖండ 2 లో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే ఇప్పటివరకూ ఆది పినిశెట్టి తెలుగులో సరైనోడు, అజ్ఞాతవాసి, వారియర్ సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి అఖండ 2తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
ఈ విషయం ఇలా ఉండగా హీరో ఆది 2022లో ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల పరంగా జోరు తగ్గించాడు. అంతేగాకుండా చాలా సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నాడు.