బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?

బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఎన్‌బీకే 109 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 

ఈ గ్లింప్స్ వీడియోలో బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ తో గ్యాంగ్ స్టార్ గా కనిపించాడు. బాలకృష్ణ చివరగా నటించిన వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్‌బీకే 109 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఎన్‌బీకే 109 సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే  ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడీగా మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో 60కి వయసు పైబడిన హీరోలకి హీరోయిన్లు దొరకడం కష్టమైంది. అందుకే ఈసారి ఎన్‌బీకే 109 టీమ్ సరికొత్తగా ఈ ప్రయోగం చేస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత నటి ఐశ్వర్య రాయ్ పూర్తీ స్థాయిలో సినిమాలపై దృష్టి సారించలేకపోయింది. ఈ క్రమంలో అడపాదడపా చిత్రాల్లో గెస్ట్ అప్పీయరెన్స్, కామియే అప్పియరెన్స్ తదితర పాత్రల్లో కనిపించింది. కానీ ఆ మధ్య ప్రముఖ తమిళ్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది. ఈ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి.