ప్రభాస్ ఫౌజీ లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ... నిజమేనా..?

ప్రభాస్  ఫౌజీ లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ... నిజమేనా..?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఫౌజీ ". ఈ సినిమాకి సీతారామం మూవీ ఫేమ్ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.

అయితే ఫౌజీ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫౌజీలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ని సెలక్ట్ చేశారని, ఈ క్రమంలో డైరెక్టర్ హనూ రాఘవపూడి అలియాకి స్టోరీ వినిపించగా వెంటనే ఒకే చెప్పిందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. కానీ ఈ విషయం గురించి మేకర్స్ ఎలాంటి అఫీషయల్ ప్రకటన చెయ్యలేదు.

ALSO READ | గ్రాండ్ గా పుష్ప విలన్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

 అయితే నటి అలియా భట్ ఆమధ్య ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరదలు సీత పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాలో ఈ అమ్మడి పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో టాలీవుడ్ లో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జిగ్రా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. ఈ సినిమాని హిందీతోపాటూ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కానీ పెద్దగాఆకట్టుకోలేక పోయింది.