Allu Arjun: ఏంటీ.. అల్లు అర్జున్ విలన్ గా నటించబోతున్నాడా..? మరి హీరో ఎవరు..?

Allu Arjun: ఏంటీ.. అల్లు అర్జున్ విలన్ గా నటించబోతున్నాడా..? మరి హీరో ఎవరు..?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అంతేకాదు పుష్ప 2తో టాలీవుడ్ తోపాటూ, బాలీవుడ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేశాడు.. అయితే ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలోనే ప్రారంభం కానున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.

అయితే ఇప్పటికే బన్నీ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో మొదటగా అల్లు అర్జున్ అట్లీ కుమార్ సినిమా చేయనున్నట్లు ఆమధ్య ఓ సినిమా ఈవెంట్ లో ప్రముఖ సైన్ నిర్మాత రవిశంకర్ తెలిపాడు. దీంతో అప్పటి నుంచి అట్లీ కుమార్ - బన్నీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే తాజాగా అట్లీ కుమార్ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అల్లు అర్జున్ అట్లీ కుమార్ సినిమాలో డబుల్ యాక్షన్ రోల్స్ చెయ్యనున్నాడని.. దీంతో హీరోతోపాటూ విలన్ రోల్ కూడా బన్నీ నే చేస్తున్నట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ అట్లీ కుమార్ తీసిన సినిమాల్లో తేరీ, అదిరింది (తమిళ్ లో మార్షల్), బిగిల్హీ, జవాన్ తదితర సినిమాల్లో హీరోలు డబుల్ యాక్షన్ రోల్స్ చేశారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఇదే ఫార్ములా ని అల్లు అర్జున్ కి కూడా అప్లయ్ చేసి హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్-అట్లీ కుమార్ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకోసం దాదాపుగా రూ.400 కోట్లు బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు సమాచారం.