సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అమృత ప్రణయ్?

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అమృత ప్రణయ్?

అమృత ప్రణయ్(Amrutha Pranay) పరువు హత్య..రెండు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. వీరిద్దరీ ట్రూ లవ్ కి, వీరికి జరిగిన అన్యాయానికి సమాజం అంతా స్పందించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..అమృత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా బెదురులంక 2012(Bedurulanka 2012) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తికేయ(Karthikeya)తో డ్యాన్స్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

వెన్నెల్లో ఆడపిల్ల..కవ్వించే కన్నెపిల్ల..అంటూ చేసిన ఈ డ్యాన్స్ ప్రసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా రొమాంటిక్ యాంగిల్ లో చేసిన ఈ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటోంది. కానీ ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ప్రణయ్ ని మరిచిపోయిందని..సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూడా..అమృత ప్రణయ్ పెర్ఫామెన్స్‌ని అభినందిస్తూ ఫైర్ అండ్ లవ్ ఎమోజీలను షేర్ చేసింది.

ఇప్పటికే అమృత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తోన్న విషయం తెలిసిందే.దీంతో సినిమాల్లో ఎంట్రీ పై ఫోకస్ పెట్టిన అమృత ప్రణయ్..సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఇక అమృత ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసే వీడియోస్ చూస్తుంటే..త్వరలో సినిమాల్లోకి  రావడం కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తోంది.  

తెలంగాణ స్టేట్ మిర్యాలగూడలో 2018 SEP 14న ప్రణయ్(Pranay) మర్డర్ జరిగింది.ఇక అమృత కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లగా..లేటెస్ట్ గా తన వీడియోస్ తో మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అమృత మళ్లీ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు న్యూస్ వినిపించినా ఇప్పటివరకు ఆమె రియాక్ట్ కాలేదు.