Bigg Boss: టైటిల్ గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు కంటెస్టెంట్!

Bigg Boss: టైటిల్ గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు కంటెస్టెంట్!

బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ 9తో పదిహేనో వారం మొదలైంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈ వారంతో అయిపోతుంది. ఈ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నట్లు సమాచారం. 

ఇకపోతే.. పద్నాలుగో వారం నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు. మొదటి ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం డిసెంబర్ 7న రోహిణి ఎలిమినేట్ అయింది. ఆదివారం డిసెంబర్ 8న యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చేసింది. దీంతో వీరిద్దరూ తమ ఆటతో ఆడియన్స్కి బానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్లారు. చివరివరకు తిట్లతో, ఒకరికొకరు పోటా పోటీతో బానే అలరించారు. అయితే, బిగ్ బాస్ యాజమాన్యం వీరి ఆటకు ఎంత ముట్టజెప్పింది అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read:-సోమవారం (Dec 9న) తగ్గిన పుష్ప2 టికెట్‌ ధరలు.. ఏ థియేటర్‌లో ఎంతంటే?

ఈ తెలుగు సీజన్ 8కి 12వ కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. హౌజ్లో 3 నెలలకు పైగా ఉంది. ఇందుకు గానూ రోజుకి రూ. 57,142 చొప్పున వారానికి రూ.4 లక్షల వరకు తీసుకుందని సమాచారం. అలా విష్ణుప్రియ 99 రోజులకు గానూ దాదాపు రూ. 57 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. దీంతో విన్నర్‌ కంటే ఎక్కువే సంపాదించేసింది ఈ అమ్మడు. 

సాధారణంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు రూ.50 లక్షల వరకు ప్రైజ్మనీ వస్తోంది. ఈ ఒక్క సీజన్‌లో మాత్రమే ప్రస్తుతం రూ. 54 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంది. అంటే ఈ లెక్కన చూస్తే విష్ణుప్రియ 3 నెలల సంపాదన.. బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే అధికంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బిగ్ బాస్ టైటిల్ గెలవకుండా ఇంత ఫేమ్ ని.. మనీని సంపాదించడం విష్ణుప్రియకే దక్కింది. 

ఇక రోహిణి విషయానికి వస్తే.. తెలుగు సీజన్ 8కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లో 9 వారాల పాటు ఉంది రోహిణి. వారానికి రూ. 2 లక్షల చొప్పున సుమారు రూ.18 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.