ఆ స్టార్ హీరో సినిమాపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. అందుకే భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా ..?

ఆ స్టార్ హీరో సినిమాపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. అందుకే భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా ..?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అట్లీ కుమార్ "AA22 x A6" అనే వర్కింగ్ టైటిల్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నాడు. దీంతో భారీ బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించి బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని తమిళ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. 

అయితే అల్లు అర్జున్ తో సినిమాకి ముందు అట్లీ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా కన్ఫర్మ అయ్యిందని పలు వార్తలు బలంగా వినిపించాయి. అంతేకాదు ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ విలన్ గా నటించనున్నాడని, అలాగే నేషనల్ క్రష్ రేష్మక మందాన హీరోయిన్ గా నటిస్తుందని గాసిప్స్ వినిపించాయి. 

అయితే ఇందులో డైరెక్టర్ అట్లీ కుమార్ సల్మాన్ కి కథ వినిపించడం, వెంటనే ఒకే చెప్పడం జరిగినప్పటికీ బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో ప్రొడ్యూసర్స్ వెనుకడుగు వేస్తున్నారని అందుకే ఈ సినిమా పట్టాలెక్కలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఇటీవలే వచ్చిన సికిందర్ మూవీ రూ.300 కోట్లు బడ్జెట్ వెచ్చించి నిర్మించగా కనీసం ఇందులో సగం కూడా రికవరీ చెయ్యలేకపోయింది. దీంతో నిర్మాతలు హెవీ బడ్జెట్ పెట్టడానికి ఆలోచిస్తున్నారు. కానీ ఇటీవలే అల్లు అర్జున్ "పుష్ప 2: ది రూల్" సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దీంతో ఈ అట్లీ కుమార్ సల్మాన్ ఖాన్ ని పక్కనపెట్టి అల్లు అర్జున్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడని సినీ టౌన్ లో చర్చించుకుంటున్నారు.