Balakrishna: బిగ్ బాస్ 9 హోస్ట్ గా మాస్ హీరో.. కూత ర్యాంప్ అంటున్న నెటిజన్లు...

Balakrishna: బిగ్ బాస్ 9 హోస్ట్ గా మాస్ హీరో..  కూత ర్యాంప్ అంటున్న నెటిజన్లు...

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రతి ఏటా ఆదరణ బాగానే పెరుగుతోంది.. దీంతో షో నిర్వాహకులు కూడా పాపులర్ కంటెస్టెంట్లు, ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, ఇలాంటివి ప్లాన్ చేస్తూ షోపై ఆసక్తిని పెంచుతున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ షో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈసారి బిగ్ బాస్ హోస్ట్ ని మార్చేందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ హోస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎక్కువసార్లు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించాడు. దీంతో ఈసారి హోస్ట్ ని మర్చి మరింత రక్తి కట్టించేందుకు బాలయ్యని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 9వ సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో షో నిర్వాహకులు బాలకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

►ALSO READ | Eesha Rebba: ఆడిషన్ కి వెళితే నల్లగా ఉన్నావంటూ అవమానించారు... ఆ హీరో ఏకంగా...

బాలకృష్ణ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో కూడా సక్సెస్ ఫుల్ గా 4 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే అన్ స్టాపబుల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా షోకి వచ్చిన అతిథులతో బాలయ్య చేసే సందడి, ప్రశ్నలు, పంచ్ డైలాగులు ఇలా ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. అయితే బిగ్ బాస్ 9వ సీజన్ హోస్ట్ గా బాలయ్య వస్తున్నట్లు వార్తలు వైరల్ అవ్వడంతో ఈసారి కూత ర్యాంప్  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగుతూ రిలీజ్ అయిన "[డాకు మహారాజ్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం   తెలుగులో ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న "అఖండ 2" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డబుల్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే కుంభ మేళాలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అఖండ 2 ఈ ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.