![రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో తెలుగు హీరో.. కన్ఫర్మ్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే..!](https://static.v6velugu.com/uploads/2025/02/is-balakrishna-playing-cameo-role-in-rajinikanth-jailer-2_YAZUy4N7Eb.jpg)
తమిళ్ సువపర స్టార్ రజినీకాంత్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఆమధ్య వచ్చిన జైలర్, వేట్టయన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ ప్రస్తుతం ప్రముఖ తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ సీక్వెల్ లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా మంచి ఎలివేషన్ వీడియొ కూడా షేర్ చేశారు. జైలర్ సినిమా బిగ్ హిట్ అవ్యవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే జైలర్ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ తదితరులకి మంచి హైప్ ఇచ్చాడు నెల్సన్. దీంతో సినిమా రిజల్ట్స్ పూర్తిగా మారింది. ఇదే ఫార్ములాని మళ్లీ జైలర్ 2 లో కూడా అప్లై చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నెల్సన్ దిలీప్ జైలర్ 2 సినిమాలో గెస్ట్ రోల్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.
ALSO READ | అఫీషియల్ అప్డేట్: ప్రభాస్ ఫౌజీలో బాలీవుడ్ స్టార్.. ఎవరంటే..?
అంతేకాదు సినిమా స్టోరీ విన్న బాలకృష్ణ వెంటనే ఒకే చెప్పాడని కానీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్, లెజెండ్ బాలయ్య కాంబినేషన్ లో సినిమా పడితేమాత్రం ఫ్యాన్స్ కి పూనకాలే అంటున్నారు కొందరు నెటిజన్లు..
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న "అఖండ 2" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే ప్రయాగరాజ్ లోని కుంభమేళాలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.