మీకు తెలుసా : ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఒకే ఒక్క దేశం అదే..!

ట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్ ప్రస్తుతం అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది..ఏ దేశంలో అయినా..జనం ఎక్కువగా నివసించే పట్టణాలు, నగరాల వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. అయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందు ఆయా దేశాలు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసుకొని.. ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు తీర్చేందుకు యత్నిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే ఓ క్రమ పద్దతిన వాహనాల రాకపోకలు సాగించడం ద్వారా ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. అయితే ట్రాఫిక్ సిగ్నల్సే లేకపోతే.. ఊహించుకోండి.. ట్రాఫిక్ ను ఎలా కంట్రోల్ చేస్తారు..? మన సరిహద్దు దేశమైన భూటాన్ లో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారట.. సిగ్నిల్ లేకుండా ట్రాఫిక్ కంట్రోల్ ఎలా సాధ్యం.. తెలుసుకుందాం.

మన సరిహద్దు దేశమైన భూటాన్ లో అస్సలు సిగ్నల్స్ లేవట...రాజధాని నగరంలో ఒక్క ట్రాఫిక్ లైట్ కూడా లేని ఏకౌక దేశం భూటాన్.  మరి ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తారు అని డౌట్ వచ్చింది కదా.. అదే ఆదేశపు ప్రత్యేకత అంటున్నారు.ట్రాఫిక్ సిగ్నల్స్ బదులుగా థీంపూలోని పోలీసులు ప్రధాన జంక్షన్లలో నిలబడి నేరుగా ట్రాఫిక్ ను నడిపిస్తారట. 

భూటాన్ లో ఆర్థిక వృద్ధి రేటు కంటే ఆ దేశపు పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తుందట. అందుకే ట్రాఫిక్ నిర్వహణ అనేది  భూటాన్ స్థూల జాతీయ సంతోషం(GNH) తత్వశాస్త్రంతో ముడిపడి ఉందట. 

అయితే ఇటీవల కాలంలో థింపూలోని కొన్న చోట్ల ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేశారట. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా మాత్రమే వీటిని నడిపిస్తున్నారట. 

మొత్తం మీద ట్రాఫిక్ లైట్లు లేని ఏకైక దేశ భూటాన్ కాకపోయినా ట్రాఫిక్ నిర్వహణలో దాని ప్రత్యేక విధానం స్థిరమైనదని, సమానమైన అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అంటున్నారు దీని గురించి పూర్తిగా తెలిసిన నెటిజన్లు.