ప్రభాస్ ఫౌజీలో బాలీవుడ్ స్టార్.. నిజమేనా.. ?

ప్రభాస్ ఫౌజీలో బాలీవుడ్ స్టార్.. నిజమేనా.. ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ "ఫౌజీ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇమాన్ ఎస్మెయిల్ నటిస్తోంది.  సీతరామం వంటి మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అందించిన ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా  యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది. హై-ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాలో  ప్రభాస్ పవర్ఫుల్  ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన మరో స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. అనుపమ్ ఖేర్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. దీంతో మేకర్స్ ఫౌజీలోని కీలకపాత్ర కోసం సంప్రదించగా వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతోంది. దీంతో అనుపమ్ ఖేర్ రీసెంట్ గా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయినట్లు సమాచారం.

ALSO READ | హిట్ దర్శకుడితో యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా..

ఈ విషయం ఇలా ఉండగా ఆమధ్య అనుకోకుండా ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డాడు. దీంతో డాక్టర్లు రెస్ట్ అవసరమని చెప్పడంతో షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి ఇంటిపట్టునే ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898AD, స్పిరిట్, సలార్ 2, ది రాజాసాబ్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్ లో  "ది రాజాసాబ్" రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినా.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం.