ఇటీవల కాలంలో ఇంటర్నెట్ లో డీప్ ఫేక్ వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖులు, సిని నటులతో పాటు సామాన్య జనులను సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు..దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగంపై అన్ని వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది.. డీప్ ఫేక్ లపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సైబర్ క్రైమ్ డీప్ ఫేక్ లను ఎదుర్కొనేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
సమాజంలో గందరగోళం, ప్రజలకు హాని,హింసను ప్రేరేపించే చర్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని ఉపయోగించబడుతుందని..డీప్ ఫేక్ అలాంటిదే అని ఇది ప్రమాదకరమైనదన్నారు కేంద్ర ఐటీ మంత్రి.2023 ఏప్రిల్ లో ఐటీ నియమాలను రూపొందించాం.. అయినప్పటికీ డీప్ ఫేక్ లు లేదా తప్పుడు సమాచారం వల్ల ఎలాంటి ముప్పు కలగకుండా కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
నవంబర్ 23,24 తేదీల్లో సోషల్ మీడియసంస్థల అధికారులతో ఐటీ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహిస్తుందన్నారు. గురువారం ( నవంబర్ 23) జరిగే సమావేశంలో మానిప్యులేటెడ్ ఫొటోలు, వీడియోలఅంశంపై చర్చిస్తామన్నారు. శుక్రవారం (నవంబర్ 24) ఐటీ నిబంధనలపై చర్చించనున్నట్లు ఐటీ మంత్రి తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై ప్రధాని మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలను రూపొందించడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటరనెట్ లో అలాంటి వీడియోలు ప్రసారం చేయబడినప్పుడు చర్యలు తీసుకోవాలని AI చాట్ బాట్ Chat GPTని ప్రధాని మోదీ కోరారు.
నేను గార్బా చేస్తు్న్న డీప్ ఫేక్ వీడియోను చూశాను. వాస్తవానికి నేను స్కూల్ డేస్ తర్వాత గార్బా ఎప్పుడూ చేయలేదు.. కానీ ఎవరో నా డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు. అని ప్రధాని మీడియాతో మాట్లాడుతూ మోదీ అన్నారు.