ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే 'దేవర ‘ఆల్ టైమ్ రికార్డ్’ కొట్టబోతుందా?.. గత సినిమాల రికార్డులివే

ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే 'దేవర ‘ఆల్ టైమ్ రికార్డ్’ కొట్టబోతుందా?.. గత సినిమాల రికార్డులివే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబరు 27న ప్రేక్షకుల  ముందుకు రానుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీకి సంబంధించి బుకింగ్స్ స్టార్ట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని చుట్టూరా అన్ని థియేటర్లలో 7 షోస్ ప్రదర్శించనున్నారు మేకర్స్. అలాగే చుట్టూరా ఉన్న 7 థియేటర్లలలో..46 షోస్ దేవర సినిమాను ప్రదర్శించనున్నారు.

ఈ షోస్ గ్రాస్ అటు ఇటుగా రూ.1.25 కోట్లు గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. అయితే, దీన్ని బట్టి చూస్తుంటే డే 1 కలెక్షన్స్ భారీ రేంజ్లో సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటి సారి. 

Also Read :- ఈ మత్తు దసరా వరకు..సింహా, సత్య మ్యాజిక్కు

ఇకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అన్ని థియేటర్లలో గత సినిమాల కలెక్షన్స్ విషయానికి వస్తే.. డే 1 హయ్యెస్ట్ కలెక్షన్స్ ప్రభాస్ కల్కి రూ. 87 లక్షలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.రెండవ స్తానం లో మహేష్ బాబు గుంటూరు కారం రూ.82లక్షలు, RRR మూవీ రూ. 75.87 గా ఉన్నాయి.

కాగా ఇప్పుడు దేవర సినిమాకు వస్తోన్న హైప్, ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ దృష్ట్యా గత లెక్కలన్నీ బ్రేక్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇది కనుక సాధిస్తే..ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవర ట్రెండ్ మొదలైనట్టే!