
పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరవాత అల్లు అర్జున్ కి గ్లోబల్ వైడ్ గా మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 2 సినిమా రూ.1100 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో అని. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా స్టోరీ నేరేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుండటంతో డైరెక్టర్ అట్లీ కుమార్ క్యాస్ట్ అండ్ క్రూ కోసం వెతికే పనిలో పడ్డాడు.
అయితే AA22 సినిమాలో బన్నీకి జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ని సెలక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని ఇంటెర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని అట్లీ కుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే హాలీవుడ్ సినిమాలకి పని చేసిన టెక్నీషియన్స్ కూడా తీసుకొస్తున్నాడు. అయితే ప్రియాంక చోప్రా ఈమధ్య బాలీవుడ్ ని కాదని ఎక్కువగా హాలీవుడ్ పై దృష్టి సారించింది. దీంతో హాలీవుడ్ లో "సిటాడెల్" వెబ్ సిరీస్ లో నటించడంతోపాటూ అరడజను సినిమాల్లో కూడా నటించింది. దీంతో ఇంటర్నేషనల్ వైడ్ గా సినిమా మార్కెట్ ని పెంచుకోవడానికి ప్రియాంక చోప్రా ఐతే బెస్ట్ అని భావించి ఆమెని సంప్రదించినట్లు సమాచారం.
Also Read:-ఫైనల్ గా సారీ చెప్పిన అలేఖ్య.. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మళ్ళీ ఓపెన్ కానుందా..?
ప్రియాంక చోప్రా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29 (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఒడిశాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా హెడ్స్ ఆఫ్ స్టేట్, ది వెరీ జోనాస్ క్రిస్మస్, ది బ్లఫ్, తదితర సినిమాల్లో నటిస్తోంది. మరి ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రియాంక బన్నీ సినిమా కి డేట్లు సర్దుబాటు చేస్తుందో లేదో అనే సందేహాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రియాంక కనుక అట్లీ-బన్నీ సినిమాలో నటిస్తే మాత్రం హాలీవుడ్ లో AA22 సినిమా ప్రమోషన్స్ కి మంచి ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.