PuriJagannadh: ఇంట్రెస్టింగ్ కాంబో.. ఊహించని స్టోరీ.. కంబ్యాక్ ప్రయత్నాల్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

PuriJagannadh: ఇంట్రెస్టింగ్ కాంబో.. ఊహించని స్టోరీ.. కంబ్యాక్ ప్రయత్నాల్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సినీ ఫ్యాన్స్లో ఆయనకుండే ఫాలోయింగ్ వేరే. కానీ, తన చివరి రెండు సినిమాలతోని కథకుడిగా, దర్శకుడిగా పూరి విఫలమైనట్లు తెలుస్తోంది.

పూరి తరహా మ్యాజిక్, తన హీరోల పాత్రల డిజైన్ ఏదీ కనబడట్లేదు. దాంతో అసలు పూరి మార్క్ సినిమా రావట్లేదు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, పూరి కథల కాంపౌండ్ నుండి అదిరిపోయే న్యూస్ బయటకి వచ్చింది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత పూరి చేయబోయే సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే.. పూరి తన తరువాతి సినిమాను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవలే ఆయన్ని కలిసి లైన్ కూడా వినిపించాడట. ఆయన చెప్పిన కథకు విజయ్ ఓకే చెప్పారని కూడా  తెలుస్తోంది.

అంతేకాదు, పూరీ చెప్పిన స్టోరీని ఆయన సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశారని.. తాను చేసిన సినిమాల్ని కూడా పక్కన పెట్టి కాల్‌షీట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందుకు విజయ్ సేతుపతితో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూరి ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రెగ్యూలర్ డ్రగ్స్ నేపథ్యంలో కాకుండా క్రైమ్‌‍తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నట్లు టాక్. దాంతో ఇంట్రెస్టింగ్ కాంబో.. ఊహించని స్టోరీ అంటూ సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ALSO READ | RC16: సినీ, క్రికెట్ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ధోనీ ఆగమనం.. మేకర్స్ క్లారిటీ!

ఇకపోతే, కొన్ని రోజుల నుంచి పూరి టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వినిపించింది. అలాగే, గోపీచంద్‌తో 'గోలీమార్' సీక్వెల్‌పైనా పూరి వర్క్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. మరి చివరికి పూరి సెలెక్ట్ చేసుకున్న ఆ హీరో ఎవరనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.