Na Anveshana: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ విన్నర్.. నెక్స్ట్ కేస్ రైతు బిడ్డపైనేనా..?

Na Anveshana: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ విన్నర్.. నెక్స్ట్ కేస్ రైతు బిడ్డపైనేనా..?

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు నిఘా ఉంచారు. దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తూ కటకటాల్లోకి నెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లైన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు. అయితే  ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంపై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా తీసుకుని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. 

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తుండటంతో కొందరు భయపడి తమ పేజీలను డిలీట్ చేస్తున్నారు. ఇంకొందరు తప్పులు ఒప్పుకుని క్షమాపణలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు.. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ప్రముఖ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పల్లవి ప్రశాంత్ క్రికెట్ ఓ క్రికెట్ ప్రెడిక్షన్స్ యాప్ ని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేశాడు. ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. 

అయితే పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలని టూరిస్ట్ వ్లోగర్ అన్వేష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. అయితే పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో "అన్నా..  నేను రైతు బిడ్డని" అంటూ ఎమోషనల్ గా వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అంతేకాదు సోషల్ మీడియా ఫేమ్ తో ఏకంగా బిగ్ బాస్ షోకి వెళ్లి టైటిల్ కూడా విన్ అయ్యాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియాలో దాదాపుగా 20 లక్షల పై చిలుకు ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read:-అనసూయ ని ఆంటీ అన్న ఆకతాయి.. దమ్ముంటే రారా అంటూ సీరియస్..

అన్వేష్ గతంలో టూరిస్ట్ వ్లోగర్ భయ్యా సన్నీ యాదవ్ తో పలుమార్లు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి గొడవ పడ్డాడు. ఆ తర్వాత సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.. మరి ఈసారి ప్రశాంత్ వీడియో షేర్ చెయ్యడంతో నెక్స్ట్ ప్రశాంత్ పై కేసు నమోదు కానుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి.