స్టార్ హీరోకి బెదిరింపులు.. రష్మిక కి టైట్ సెక్యూరిటీ.. ఎందుకంటే..?

స్టార్ హీరోకి బెదిరింపులు.. రష్మిక కి టైట్ సెక్యూరిటీ.. ఎందుకంటే..?

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు సల్మాన్ ఖాన్ Y+ కేటగిరీ ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూటింగ్ కి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ హాజరయ్యాడు. 

అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ AR మురుగదాస్ దర్శకత్వం  వహిస్తున్న సికిందర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా కన్నడ ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాన నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతోంది. 

ALSO READ | బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పుష్ప 2 టీం.. ఒకరోజు ముందుగానే..

బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం సికిందర్ సినిమా సెట్ లో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందాన కి కూడా సెక్యూరిటీ పెంచినట్లు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ విషయం ఉండగా సికిందర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ పూర్తీ చేసేందుకు శ్రమిస్తున్నప్పటికీ ప్రస్తుతం హీరో సల్మాన్ ఖాన్ ఎదుర్కుంటున్న పరిస్తితుల కారణంగా షూటింగ్ ఆగినట్లు సమాచారం. దీంతో అనుకన్న సమయానికి సికిందర్ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై కొంత మేర సందిగ్ధత నెలకొంది.