ఆ కారణంగా బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఎలిమినేటెడ్..?

ఆ కారణంగా బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఎలిమినేటెడ్..?

ప్రముఖ రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్న గంగవ్వ తన ఆట తీరుతో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. దీంతో గంగవ్వ  ఎలిమినేషన్స్ నుంచి సులభంగా బయట పడుతోంది. 

అయితే గంగవ్వ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతోందని పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. అయితే ఇటీవలే గంగవ్వపై జంతు హింసపై పలు సెక్షన్ల క్రింద జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కారణంగానే షో నిర్వాహకులు గంగవ్వ ని బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ చేసి బయటికి పంపించారని కొందరు చర్చించుకుంటున్నారు. 

కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే గంగవ్వ గతంలో బిగ్ బాస్ 4 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే ఆకట్టుకుంది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్లోకి వెళ్ళిన మొదటి వారంలోనే బయటికి వచ్చింది.

ALSO READ | రిలీజ్ కి ముందే కాంతార, కేజీయఫ్, లియో సినిమాల రికార్డులపై కన్నేసిన పుష్ప..

అయితే 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంతో జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో గంగవ్వతోపాటూ యూట్యూబర్ రాజుపై  వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పటికే యూట్యూబర్ రాజు రూ.25000 జరిమానా కట్టినట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా గంగవ్వ మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. దీంతో ఫేమ్ పొందడానికి వయసుతో సంబంధం లేదని గంగవ్వ నిరూపించింది.