
ఈ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఒక రోజు కొన్ని యాప్స్ పనిచేయని సంగతి తెలిసిందే. జీ–మెయిల్, యాహూ మెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్, బీబీసీ వెదర్, అమెజాన్ వంటి యాప్స్ పనిచేయలేదు. గూగుల్ వెంటనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. అయితే ఇప్పటికీ కొంతమంది తమ ఫోన్స్‌లో ఇంకా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవచ్చు. కానీ, కొన్ని ఫోన్స్‌లో ఇవి అప్‌డేట్ అవ్వడం లేదని యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. దీన్ని ఫిక్స్ చేసేందుకు ఎక్స్‌పర్ట్స్ కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్లే స్టోర్ లేదా సెట్టింగ్స్‌లో అప్‌డేట్‌పై ట్యాప్ చేసినా అప్‌డేట్ అవ్వడం లేదు. ఇలాంటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. యాప్ అండ్ సెట్టింగ్స్‌పై ట్యాప్ చేసి, ప్లే స్టోర్‌లోకి వెళ్లి, స్టోరేజ్ అండ్ క్యాచెలోకి వెళ్లి, క్లియర్ డాటాపై క్లిక్ చేయాలి. కానీ, ఇలా చేయడం వల్ల ప్లేస్టోర్‌లోని సెట్టింగ్స్ కూడా మారిపోతాయి. అంటే ఆటో అప్‌డేట్, పేరెంటల్ కంట్రోల్స్ వంటివి తిరిగి సెట్ చేసుకోవాలి. తర్వాత ప్లేస్టోర్‌లోకి వెళ్లి, ‘ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ’పై ట్యాప్ చేస్తే,అప్‌డేట్ అవుతుంది. ఒకవేళ అప్పటికీ అప్‌డేట్ కాకుంటే, ప్లేస్టోర్‌లో సెర్చ్‌బార్‌లోకి వెళ్లి, ‘గూగుల్ క్రోమ్’ సెలక్ట్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవాలి. ఒక్కసారి ఇది అప్‌డేట్ అయ్యిందంటే, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని యాప్స్ మామూలుగా పనిచేస్తాయి.